Thursday, December 5, 2024

AP | టీడీపీ నేత పుల్లారెడ్డిపై కత్తులతో దాడి..

నంద్యాల బ్యూరో : టీడీపీ నేత పుల్లారెడ్డిని తీవ్రంగా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని మండల కేంద్రంలో పాణ్యం టిడిపి నాయకుడు పుల్లారెడ్డి పై కొందరు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎమ్మెల్యే అక్రమ వసూళ్ల బాగోతాన్ని బయట పెట్టినందుకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వర్గానికి చెందిన పాణ్యం టిడిపి నాయకుడు పుల్లారెడ్డిని శనివారం రాత్రి 9.50 గంట‌ల స‌మ‌యంలో అతి కిరాతకంగా కత్తులు, కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు తెలుపుతున్నరు.

ఎంపీ బైరెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. కొట్టిన మనుషులు పాణ్యం ఎమ్మెల్యే గౌరు వర్గీయులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement