Wednesday, November 29, 2023

Breaking | క‌ర్నూలు జిల్లాలో దారుణం.. భార్య‌, అత్త‌ను గొంతుకోసి చంపేశాడు

పెద్దకడబూరు, (ప్రభ న్యూస్) : క‌ర్నూలు జిల్లాలో దారుణం జ‌రిగింది. పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామంలో ఇవ్వాల (శుక్రవారం) తెల్లవారుజామున ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గుర‌య్యారు. జూల‌వాడి గ్రామానికి చెందిన కరెంటు నాగరాజు తన భార్యను, అత్తను గొంతుకోసి చంపేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యల‌కు గల కారణాలపై ఎంక్వైరీ జ‌రుగుతోంది. గ్రామంలో ఒకేసారి ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురికావడంతో గ్రామస్తులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement