Saturday, November 27, 2021

ఆదాయానికి మించిన ఆస్తులు… కొనసాగుతున్నా ఏసీబీ సోదాలు..

ప్రభ న్యూస్ : ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడగట్టారనే వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విశాఖ పాడేరు ఐటిడిఎ ఈఈ కె.వి.ఎస్‌. నగేష్‌ కుమార్‌ ఇళ్ల పై ఏసీబీ సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజాము 7 గంటల నుంచి నగేష్‌ కుమార్‌ కార్యాలయంతో పాటు ఆయన ఇళ్ల పై అలాగే ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. నగేష్‌ కుమార్‌ బాలయ్య శాస్త్ర లేఔట్‌లో గల నివాసంలోను, బంధువుల ఇళ్లలోను సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏసిబి డిఎస్పీ రమణ మూర్తి మాట్లాడుతూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే సమాచారంతోనే పాడేరు ఐ.టి.డి.ఎ ఈఈ నగేష్‌ కుమార్‌ కార్యాలయంతోపాటు ఆయన ఇళ్లపైన అలాగే ఆయన బంధువుల ఇళ్లపైన ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఇప్పటివరకూ రూ. 1.34 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల గుర్తించినట్లు చెప్పారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ. 20కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2 హౌస్‌ ఫ్లాట్లు, మధురవాడలో అత్యంత ఖరీదైన 556 గజాల స్థలంతో పాటు 9 ఇళ్ల స్థలాలు, 6.5 సెంట్ల లో వ్యవసాయ క్షేత్రం, 900గ్రాముల బంగారం, 3.2 కిలోల వెండి,రూ. 2.46లక్షల నగదు, 6 ఎఫ్‌.డి.లు, 2 కార్లు మరికొన్ని ఆస్థి పత్రాలతో పాటు ఓ బ్యాంకు లాకర్‌ను కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. అక్రమాస్తుల వ్యవహారంలో నగేష్‌ కుమార్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయన్నారు. బ్యాంకు లాకర్‌ తెరవాల్సి ఉందని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News