Wednesday, October 9, 2024

AP: సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో శవమై తేలిన చిన్నారి అస్పియా..

పుంగనూరులో విషాద ఛాయలు
పుంగనూరు, అక్టోబర్ 2 (ప్రభ న్యూస్) : నా చిట్టితల్లి బ్రతికే ఉంది.. నా బిడ్డ తిరిగి వస్తుంది అంటూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న తల్లికి చివరికి కడుపుకోత మిగిలింది. గత నెల 29వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అదృశ్యమైన అస్పియా (7) బుధవారం పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో శవమై తేలింది. 11 ప్రత్యేక పోలీసు బలగాలతో డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన కూడా చిన్నారి ఆచూకీ తెలియకపోవడం ఉత్కంఠగా మారిన పరిస్థితుల్లో చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది.

సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఓ శవం తేలుతున్నదని స్థానికులు కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిశీలించగా ఆ శవం చిన్నారి అస్పియాదేనని నిర్ధారణకు వచ్చారు. ముక్కు పచ్చలారని చిన్నారి ఎవరికి ఏ ద్రోహం చేస్తుంది. ఆమె విగత జీవిగా మారడానికి ఎవరు కారణం. ఆమెను సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్దకు ఎవరు తీసుకుని వెళ్లారన్న ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు. ఈ తాజా ఘటనపై పోలీసులకు మరో సవాలు మొదలైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement