Saturday, April 20, 2024

అస‌ని ఎఫెక్ట్‌.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మల్లింపు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అసని తుఫాన్‌ ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మల్లించారు. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్‌ చేశారు. గుంటూరు-రేపల్లే, రేపల్లె-గుంటూరు, గుంటూరు-రేపల్లె, రేపల్లె-తెనాలి, కాకినాడ పోర్టు-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కాకినాడ పోర్టు మధ్య తిరిగే రైళ్లను రద్దు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గుంటూరు-డోన్‌ మధ్య నడిచే రైలును 3గంటలకు రీ షెడ్యూల్‌ చేశారు. గూడూరు-విజయవాడ మధ్య నడిచే రైలును గూడూరు-నెల్లూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ-బిట్రగుంట, బిట్రగుంట-విజయవాడ, సూళ్లూరుపేట-నెల్లూరు, నెల్లూరు-సూళ్లూరుపేట రైళ్లను మధ్య తిరిగే రైళ్లను రద్దు చేశారు. మచిలీపట్నం-విశాఖపట్టణం(ట్రైన్‌ నెం.17219) 14వ తేదీ రాత్రి 9.25 గంటలకు, 15వ తేదీన విశాఖపట్టణం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు 17220ను రాత్రి 10.10గంటలకు వెళ్లేలా బయలుదేరే వేళలు మార్చారు.

దారి మళ్లింపు..

ఈ నెల 12 నుంచి 16, 25 నుంచి 28 తేదీల మధ్య విశాఖపట్టణం-ఎల్‌టీటీ ముంబై మధ్య నడిచే రైలును కుర్దువాడి, మిరాజ్‌ మీదుగా మల్లించారు. 13 నుంచి 17, 26 తేదీల్లో నడిచే ఎల్‌టీటీ ముంబై-విశాఖపట్టణం మధ్య నడిచే రైలును మిరాజ్‌, కుర్థువాడి మీదుగా, 25 నుంచి 28 మధ్యన కాకినాడ పోర్టు-ఎల్‌టీటీ ముంబై మధ్య నడిచే రైలును కుర్థువాడి, మీరాజ్‌, 26 నుంచి 29 మధ్యన ఎల్‌టీటీ ముంబై-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైలును మిరాజ్‌, కుర్థువాడి మీదుగా మల్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement