Thursday, May 26, 2022

Asani Cyclone : ఏపీ తీరానికి కొట్టుకొచ్చిన స్వర్ణ రథం

అసని తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం తీరానికి ఓ రథం కొట్టుకొని వచ్చింది. అసని తుఫాను ప్రభావం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో కొంత వరకు ఉంది. దీంతో మండలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు తీరప్రాంతలో ఎక్కువగా ఉంది. అలాగే ఎం సంన్నాపల్లి తీరానికి రధం,మందిరం ఆక్రుతిలో ఉన్న శకలాలు కొట్టుకొచ్చాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, తుఫాను ప్రభావంతో ఒరిస్సా ప్రాంతంలో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అని స్థానికులు తెలిపారు. ఇది ఒరిస్సా ప్రాంతంకి చెంది ఉంటుంది అని స్థానిక మత్స్యకారులు, స్థానికులు అంటున్నారు. కానీ చూపరులను ఆశ్చర్యం కలిగిన సంఘటనగా భావిస్తున్నారు.

మరోవైపు అసనీ తుఫాను ప్రభావంతో ఉప్పాడ, తొండంగిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను అసని తుఫాను వణికిస్తోంది. నిన్న రాత్రంతా తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు, పలుచోట్ల వర్షాలు కురిసాయి. తుపాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. రేపల్లె, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో భారీ వర్షం పడుతోంది. తుపాను తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం హార్బర్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తుఫాన్ పై అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement