Wednesday, November 6, 2024

KNL: కేసీ కాలువలో ఆర్మీ జవాన్ గల్లంతు..

నగరంలోని కేసీ కాలువ వద్ద విషాదన ఘటన చోటు చేసుకుంది. స్థానిక బీక్యాంప్ న‌కు చెందిన పవన్ కళ్యాణ్ (24) ఆర్మీలో జమ్మూకాశ్మీర్ సెక్టార్ లో జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల సెలవులకు కర్నూలు వచ్చిన పవన్, రాత్రి స్నేహితులతో కలిసి స్వామిరెడ్డి నగర్‌లోని వినాయక విగ్రహం వద్ద గడిపాడు.

స్నేహితులతో కలిసి కేసీ కాలువలో ఈతకు దిగాడు. ఆ సమయంలో కాలువలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్నేహితల కళ్లెదుటే కాలువలో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. దాంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

కొద్ది సేపటికే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పవన్ తండ్రి భాస్కర్ కర్నూలు కలెక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్నారు. కేసీ కాలువలో కొడుకు గల్లంతు అవ్వడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement