Friday, March 29, 2024

కాశ్మీర్‌ అందాలను గుర్తుకు తెస్తున్న అరకు.. అద్భుతం అంటున్న పర్యాటకులు..

అరకులోయ రూరల్‌, ప్రభ న్యూస్‌ : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మన్య ప్రాంతంలో ఈ సీజన్లో అద్భుత అందాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఏడాదిలో అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాలలో మాత్రమే అద్భుత అందాలతో కనువిందు చేసే సుందర కమనీయ రమణీయ దృశ్యాలతో సందర్శకులను ఆహ్లాదభరితులను చేసే అరకు మన్యం జూలై నెలలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త అందాలతో కనువిందు చేస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులకు గురి చేస్తుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అరకులోయ మన్యం ప్రకృతి అందాలు మరింత రెట్టింపు అవ్వగా అరకు ఘాట్‌ రోడ్లోనే అనేక దృశ్యాలు పర్యాటకులను స్థానికులను ఆనందానికి గురి చేస్తూన్నాయి. ఏడాది పొడవునా కాశ్మీర్‌ ప్రాంతంలో కనిపించే మనోహర దృశ్యాలు జూలై నెలలో అరకు మన్యంలో సాక్షాత్కారిస్తున్నాయి. అరకు ఘాట్‌ రోడ్లో సుంకరమెట్ట,గాలికొండ,దముకు ప్రాంతాల్లో కాశ్మీర్‌ ను తలపించే విధంగా సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో పర్యాటకులే కాకుండా స్థానికులు సైతం ఈ అపురూప అద్భుత అందాల దృశ్యాలను తిలకించి మైమరచిపోతున్నారు. అంతేకాకుండా ఈ సుందర దృశ్యాల ప్రాంతాల వద్ద సెల్ఫీలు దిగుతూ అపర కాశ్మీర్‌ అరకులోయ అంటూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

ఇప్పటివరకు ఆంధ్ర కాశ్మీర్‌ అంటే లంబసింగిని గొప్పగా చెప్పుకునేవారు అయితే ఇటీ-వల కాలంలో ఆంధ్ర ఊటీ అరకు మన్య ప్రాంతంలో కూడా కాశ్మీరు తలపించే విధంగా అద్భుత అందాలు దర్శనమిస్తున్నాయి.దీంతో అరకులోయ కూడా ఆంధ్ర కాశ్మీరేనని పలువురు చెప్పుకుంటున్నారు.ఈ ప్రాంతంలో ఈ సీజన్లో ఏ పర్యాటకులు పర్యటించారు కారణం ఈ సీజన్లో జోరుగా కురిసే వర్షాలు రహదారుల చిన్నబిన్నం ట్రాఫిక్‌ అంతరాయం చెట్లు కూలిపోవడం వంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇవి ఏమీ లెక్కచేయకుండా అరకు మన్యంలో సాక్షాత్కరిస్తున్న అద్భుత అందాలను తిలకించేందుకు జోరు వర్షాలను సైతం లెక్కచేయకుండా పర్యటకులు వస్తున్నారు.ఇప్పటినుండి ఆంధ్రఊటీ గానే కాకుండా అపర కాశ్మీర్‌ గా కూడా చెప్పుకుంటున్నారు.ఇది ఈ ప్రాంత వాసులకే కాకుండ అల్లూరి సీతారామరాజు జిల్లాకే ఎంతో గర్వకారణమని మన్య ప్రాంత ప్రజలు చెప్పుకుంటు-ండగా ప్రభుత్వం జిల్లా అధికారులు మరింతగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికల రూపొందిస్తే ఆంధ్రఊటీ- అరకులోయ మరో కాశ్మీర్‌ గా పర్యాటక పటంలో పేరు పొందక తప్పదని ప్రతి ఒక్కరు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement