Wednesday, October 2, 2024

AP | అక్టోబరు 3 నుంచి టెట్‌ పరీక్షలు…

అమరావతి, ఆంధ్రప్రభ:ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టెట్‌కు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్ధులు హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ వి. విజయరామరాజు ఒక ప్రకటనలో కోరారు.

టెట్‌కు ఇప్పటి వరకు 4,27,300 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 2,84,309 మంది హాల్‌ టికెట్స్‌ డౌన్లోడ్‌ చేసుకున్నట్లు తెలిపారు. హాల్‌ టికెట్ల లో ఏవైనా తప్పులు వున్నట్లయితే అవసరమైన ఒరిజనల్‌ సర్టిఫికెట్లు సమర్పించి పరీక్ష కేంద్రం దగ్గర నామినల్‌ రోల్స్‌ లో సరిచేయించుకోవాలన్నారు.

ఇందుకోసం పరీక్షా కేంద్రం దగ్గర అధికారులలను నియమించామన్నారు. అభ్యర్థులు గతంలో నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం 11, 12 తేదీలు మినహా అక్టోబర్‌ నెల 3 వ తేదీ నుండి 21 వ తేది వరకు టెట్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

ఏదైనా సందేహాలు ఉంటే డైరెక్టరేట్‌ కమీషనర్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్స్‌ 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618కు ఉదయం 10 నుండీ రాత్రి 10 వరకు ఫోన్‌ ద్వారా సం ప్రదించి వివరాలు తెలుసకోవచ్చని డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement