Thursday, October 3, 2024

AP: ద‌స‌రాకు ఏపీఎస్ఆర్టీసీ రెడీ..

అక్టోబర్ 3 నుంచి ప్రత్యేక బస్సులు
13రోజుల పాటు అందుబాటులో స‌ర్వీస్ లు
అద‌నంగా రంగంలోకి 964 బ‌స్సులు
హైద‌రాబాద్ – విజ‌య‌వాడ మ‌ధ్య 353 స్పెష‌ల్ స‌ర్వీస్ లు

విజ‌య‌వాడ – ఏపీలో అక్టోబర్ 3 నుంచి దసరాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. 13 రోజులు పాటు తిరిగే విధంగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో 964 బస్సులు ఉంచింది. హైదరాబాద్- విజయవాడ మధ్య అత్యధికంగా 353 బస్సులు ఏర్పాటు చేశారు.

రాజమండ్రికి 241, విశాఖకు 90, బెంగళూరుకు 14, చెన్నైకి 22, ఇతర ప్రాంతాలకు 244 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. అవ‌స‌ర‌మైతే బ‌స్సు స‌ర్వీస్ ల‌ను పెంచుతామ‌ని తెలిపింది. అలాగే ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి విజ‌య‌వాడ‌కు కూడా అద‌న‌పు సర్వీస్ లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement