Tuesday, March 26, 2024

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ప‌ట్ల‌ ఆప్కాస్‌ చొరవ ప్రశంసనీయం.. ఈఎస్ ఐ కార్డులు అంద‌జేసిత‌

అమరావతి, ఆంధ్రప్రభ: వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ సమస్యల పరిష్కారం కోసం అప్కాస్‌ (ఎపి కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్డ్‌ సర్వీసెస్‌) చూపుతున్న చొరవ ప్రశంసనీయమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె నివాస్‌ అన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇఎస్‌ఐ కార్డులను ఆయన అందజేశారు. వైద్య ఆరోగ్యశాఖ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని సోమవారం నాడు ఏపిఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో అప్కాస్‌ నిర్వహించింది.

కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నివాస్‌ మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఆప్కాన్‌ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి సంబంధించిన ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ మరియు వారి సాంకేతిక పరమైన సమస్యలను ఆప్కాస్‌ సిబ్బంది అక్కడికక్కడే పరిష్కరించారు. కార్డుల ప్రాముఖ్యతను అప్కాస్‌ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) బి. నాగ ప్రసాద్‌ ఉద్యోగులకు వివరించారు. ఈ సందర్భంగా అప్కాస్‌ సిబ్బందికి నివాస్‌ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement