Friday, October 4, 2024

AP అనంతలో యువతి దారుణ హత్య

అనంతపురం, సెప్టెంబర్ 8 (ప్రభ న్యూస్)ఆత్మకూరు మండలం వడ్డుపల్లి కాలువ గట్టు సమీపంలో ఓ యువతి(22)ని అత్యంత దారుణంగా హతమార్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అటు వైపు వెళ్లిన గొర్రెల కాపరులు యువతి మృతదేహాన్ని చూసి ఆత్మకూరు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన యువతి ఎవరు, ఎందుకు హత్య చేశారు, నిందితులు ఎవరనే వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement