Wednesday, December 11, 2024

AP – వ‌లంటీర్ల‌కూ..మేలు చేస్తాం – పవన్ కల్యాణ్ భరోసా

పంచాయితీ నిధుల‌ను జ‌గ‌న్ మింగేశారు
అయిదేళ్ల‌లో గ్రామ సీమ‌లు పూర్తిగా మారిపోవాలి
త్వ‌ర‌లోనే కావాల్సిన నిధులు అంద‌జేస్తాం
స‌ర్పంచ్‌ల‌ను గ్రామ ప్ర‌థ‌మ పౌరులుగా గుర్తిస్తాం
గ్రామాలు స్వ‌యం స‌మృద్ధిగా ఎద‌గాలి
స‌ర్పంచ్‌ల స‌మావేశంలో ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌:
గ‌త ప్ర‌భుత్వం మోసం చేసిన వ‌లంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. అయ‌తే.. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చ‌ని, కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరని చెప్పారు. ఇదో సాంకేతిక సమస్య అని. దీన్ని అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు. అమ‌రావ‌తిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ సంఘాల ప్రతినిధులతో గురువారం పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. సర్పంచుల‌ సంఘం అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి సర్పంచ్‌లు వచ్చారు. ఈ సందర్భంగా వ‌లంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచులు విజ్ఞప్తి చేశారు.. దీనిపై స్పందించిన ప‌వ‌న్ ఉద్యోగాల్లో లేని వాళ్ల గురించి ఏం నిర్ణ‌యం తీసుకోవాలో అలోచిస్తామ‌ని అన్నారు..

మాది చేత‌ల ప్ర‌భుత్వం
దేశంలో 70శాతం ప్రజలు పల్లెల్లోనే ఉంటారని.. గ్రామాలను బలోపేతం చేస్తూ గాంధీ సిద్దాంతాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆకాంక్షతోనే తాము ఉన్నామని ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ అన్నారు. మాటలతో కాకుండా చేతలతోనే తమ ప్రభుత్వం పని తనం చూపుతుందని తెలిపారు. సర్పంచ్‌లు ఇచ్చిన 16 డిమాండ్స్‌లో కీలకమైన వాటిని గుర్తించి వాటిని పూర్తి చేశామన్నారు. కేరళలో పని చేస్తున్న అధికారి కృష్ణతేజను డిప్యూటేషన్ మీద తీసుకువచ్చామని తెలిపారు. ఆయన సహకారం వల్లే నేడు గ్రామాల అభివృద్దికి ప్రణాళికులు సిద్దం చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. తన పేషీలో ప్రజలకు మేలు చేద్దామనే ఆకాంక్ష ఉన్న అధికారులు ఉండటం అదృష్టమన్నారు.

- Advertisement -

ఎంపీ ల్యాడ్స్‌తో క‌మ్యూన‌టీ హాల్స్ ..

ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ద్వారా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌ చెప్పారు. 2014 నుంచి 2019 వరకు చేసిన పనులకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని.. ఆ నిధులు విడుదల చేసేందుకు కేబినెట్‌లో నిర్ణయించామని తెలిపారు. అమరావతిలో పంచాయతీరాజ్ భవనానికి రెండు ఎకరాలు కేటాయించాలని తనని కోరారని.. ట్రైనింగ్ సెంటర్ కూడా నిర్మాణం చేసే విధంగా అవసరమైన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇక గ్రామాలలో నరేగా పధకం కింద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని స‌ర్పంచ్ లను కోరారు. ఇప్పటికే దీనిపై పల్లె వనాలు పేరుతో ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సర్పంచ్‌లకు ప్రధమ పౌరుల స్థానం ఇవ్వాలని అప్పుడే వారికి ఆ గుర్తింపు ఉంటుందన్నారు. పంచాయతీలకు నిధులు ఎక్కువ కావాలని.. ఇందుకు స్వయం పోషక పంచాయతీలుగా ఎదగాలని అన్నారు.

వారి జీతాలు పెంచే ఆలోచ‌న‌లో..
సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు వేతనాలు పెంపుపై కూడా కసరత్తు చేస్తున్నామని ప‌వ‌న్ అన్నారు. అయితే పంచాయతీల్లో కూడా ఆదాయ వనరులు పెంచుకుని ఆర్ధికంగా ఎదగాలన్నారు. వచ్చే యాభై ఏళ్ల‌లో కలప అవసరం చాలా ఉంటుందని తెలిపారు. అందువల్ల గ్రామాల్లో వెదురుబొంగులను పెంచి.. బయో డీజిల్ తయారీకి సరఫరా చేసేలా చేయాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి కలపను పెంచేలా లక్ష్యాలను నిర్దేశిస్తే ఆదాయం వస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement