Friday, October 11, 2024

AP – సార్… డాక్టర్లు కావాలి – మంత్రి సత్య ప్రసాద్ కు వినతి

( ఆంధ్రప్రభ స్మార్ట్ , శ్రీ సత్యసాయి జిల్లా బ్యూరో) పెనుగొండ నియోజకవర్గంలో పీహెచ్ సీలకు నూతన భవనాలు నిర్మించాలని, వైద్య సిబ్బందిని నియమించి మెరుగైన వైద్య సదుపాయలు కల్పించాలని రాష్ట్ర ఆరోగ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసన్ కంపెనీకి ఎదుట రెడ్ క్రాస్ సొటైటీకి కేటాయించిన భూమిని ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ , బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పరిశీలించారు.

త్వరగా చర్యలు చేపట్టి సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మంత్రులు అన్నారు. బ్లడ్ బ్యాంకు, డయాలసిస్ , కాన్సర్ టెస్టింగ్ సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. పెనుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పీహెచ్ సీలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని, నూ తన బిల్డింగుల నిర్మాణం చేపట్టాలని మరింత వైద్య సిబ్బందిని నియమించాలని, వైద్యేసేవల్ని మెరుగు పర్చాలని మంత్రి సత్య కుమార్ కి మంత్రి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement