Thursday, April 25, 2024

అగ్రీ ఎక్స్ పోర్ట్ లో ఏపీ టాప్.. అమెరికా, ఆస్ట్రేలియాలకు సప్లయ్..

ప్ర‌భ‌న్యూస్ : వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ది అగ్రికల్చర్‌ అండ్‌ ప్రాసెసెడ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటీ–ఎపెడా) 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను తొలి ఆరు నెలల ప్రోగ్రెస్‌ పై విడుదల చేసిన తాజా నివేదికలో ఎగుమతుల్లో ఏపీ అన్ని రాష్ట్రాల్ర కన్నా ముందున్నట్టు- వెల్లడించింది. ఎపెడా నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు రూ.19 వేల కోట్ల విలువైన 38.86 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగమతయ్యాయి.

ఏపీ నుంచి వ్యవసాయోత్పత్తులను దిగుమతి చేసుకున్న దేశాల్లో అమెరికా, ఆస్ట్రేల్రియా, న్యూజిలాండ్‌ తో పాటు- అరబ్‌ దేశాలు ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తుల్లో నూటికి 85 శాతం రొయ్యల ఎగుమతులున్నాయి. రొయ్యల ఎగుమతుల్లో ఏపీ వాటా 67 శాతంగా ఉండటం విశేషం. ఆహార ఉత్పత్తుల్లో బియ్యం, అపరాలు, బెల్లం, మొక్కజొన్నతో పాటు- ఉద్యాన పంటలైన అరటి, బత్తాయి, మామిడితో పాటు- వివిధ రకాల పండ్లు, ప్రాసెస్‌ చేసిన పండ్ల రసాలు అధికంగా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement