Monday, October 7, 2024

AP/TG – చంద్ర‌బాబుకు కెటిఆర్ ప్ర‌శంస‌లు

ఇచ్చిన మాట నిలుపుకున్నారంటూ అభినంద‌న‌లు
వారంలోనే పెన్ష‌న్ పెంచి వృద్ధుల‌కు అస‌రాగా నిలిచారు
ఇక్క‌డ రేవంత్ మాత్రం మాట త‌ప్పారు
రైతు బంధు, రైతు బ‌రోసాకే కాదు సిఎం కుర్చికే భ‌రోసా లేదు
బిఆర్ఎస్ కు ఓటేశార‌నే క‌క్ష‌తోనే హైద‌రాబాద్ లో కూల్చివేత‌లు

హైద‌రాబాద్ – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పెన్షన్ పెంపుపై ఏపీ సీఎం మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ మేర‌కు ట్విట్ చేశారు. .ఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారని అన్నారు. ఇది అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.. తెలంగాణ‌లో మాత్రం పెన్షన్ల పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. తెలంగాణలో చిట్టినాయుడు సోదరుల కంపెనీ నడుస్తుందన్నారు. రైతు బంధు, భరోసా కాదు..సీఎం కుర్చి కే భరోసా లేదన్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలిచినామన్నారు. అందుకే రేవంత్ రెడ్డి నగర ప్రజల పై కక్ష కట్టారన్నారు. పేదల ఇండ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement