Thursday, November 28, 2024

AP TET Results – టెట్ ఫ‌లితాలు విడుద‌ల

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ నేటి ఉద‌యం విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి 21వ వరకు టెట్ పరీక్షలు జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 29న తుది కీ విడుదల చేశారు. . తాజాగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు. ఇక ఈ ఫ‌లితాల‌లో మొత్తం 50.79 మంది అర్హ‌త సాధించారు.


ఇదిలా ఉండగా మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులతో ఈ నెల 6న ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రకటన విడుదల తేదీ నుంచి నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement