Wednesday, April 24, 2024

స్మార్ట్ పోలీసింగ్ లో ఏపీ తెలంగాణ టాప్.. ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శం..

ప్ర‌భ‌న్యూస్: పోలీస్‌ విధుల్లో ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తున్న తెలుగు రాష్ట్రాలు మరోసారి దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. స్మార్ట్‌ పోలీసింగ్‌ అంశంపై ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన‌ సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించగా, ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. 2014లో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సులో స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానాలను అనుసరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. స్మార్ట్‌ పోలీసింగ్‌ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ సర్వే నిర్వహించింది.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌, నిష్పాక్షికత, చట్టబద్ధ, పారదర్శక పోలిసింగ్‌, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. పోలీస్‌ సెన్సిటివిటి, పోలీసుల ప్రవర్తన, ప్రజలకు అందుబాటులో పోలీసు వ్యవస్థ, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం విభాగాల్లో తెలంగాణకు మొదటి స్థానం దక్కగా, ఏపికి రెండో స్థానం దక్కింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement