Wednesday, November 27, 2024

AP | విద్యార్థిని ఆత్మహత్య.. విచారణ వేగవంతం చేయండి : డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాజమహేంద్రవరం విమానాశ్రయం ద‌గ్గ‌ర‌ కొత్తపేట నియోజకవర్గం మడికి గ్రామానికి చెందిన చెక్కపల్లి శ్రీనివాసరావు కలిశారు.. 10వ తరగతి చదువుతున్న తన కూతురు వెన్నెల రెండ్రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడిందని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

చెముడులంక గ్రామంలోని శ్రీ షిర్డీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో త‌న కూతురు వెన్నెల చదువుతుంద‌ని, స్కూల్ యాజమాన్యం ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే వెన్నెల ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. బాధితుల నుంచి ఈ విషయం విన్న పవన్ కల్యాణ్.. డా.బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీతో మాట్లాడి, విద్యార్థిని ఆత్మహత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement