Friday, November 8, 2024

Ap:కనకదుర్గమ్మకు వెంకటేశ్వర స్వామి పట్టు వస్త్రాలు


తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాల సమర్పణ…

( ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో )ఏడుకొండల పై కొలువై ఉన్న
దేవ దేవుడు కలియుగ దైవం పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పట్టు వస్త్రాలను కనకదుర్గమ్మ వారికి సాంప్రదాయ బద్ధంగా సమర్పించారు. స్వామి వారి సన్నిధి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం సహాయ కార్య నిర్వహణ అధికారి బి. దొరస్వామి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దని అలంకృత కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు శుక్రవారం సమర్పించారు. వీరికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈఓ రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఎస్. కళాబాయి, బిఎస్ ప్రియదర్శిని,బి. భరత్, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement