Saturday, November 30, 2024

AP – అనిల్ కు బిరియాని విందు – ఏడుగురు పోలీస్ లు సస్పెన్షన్

అమరావతి – విధుల్లో నిర్లక్ష్యం వహించిన గుంటూరు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి..

రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల విందు భోజనం అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో హల్‌ చల్‌ చేస్తోన్న విషయం విదితమే.. బోరుగడ్డ అనిల్‌ను మంగళగిరి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు తరలించే క్రమంలో.. రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‍ను డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్‍కు తీసుకెళ్లారు పోలీసులు…

అయితే, ఆ వీడియోలో కాస్తా వైరల్‌గా మారాయి.. పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.. ఇప్పటికే కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో.. ఇది తెరపైకి వచ్చింది.. దీంతో సీరియస్ గా స్పందించి సస్పెన్షన్ వేటు వేశారు పోలీసు ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు అధికారులు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement