Thursday, December 5, 2024

AP – పోలీస్ వ్య‌వ‌స్థ‌ను నెల రోజుల‌లో గాడిన పెడ్తాం – చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చను లేవనెత్తారు. కొంత మంది వైసీపీ నేతలు మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కేబినెట్‌ సమావేశంలో పేర్కొన్నారు. కొంత మంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారన్నారు. ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు.

కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేసినా రియాక్టు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఇంట్లో మహిళల పైనా పోస్టులు పెడితే ఊరుకోవాలా? అందువల్లే తాను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని పవన్ అన్న‌ట్లు చెప్పారు. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు గత ప్రభుత్వం నుంచే పోలీసులు ఇలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థను గాడిన పెడదామని సీఎం స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో అసత్య పోస్టులను ఇకపై ఉపేక్షించేది లేదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement