Friday, October 11, 2024

AP – కదిరి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా

బత్తలపల్లి, సెప్టెంబర్ 7(ప్రభన్యూస్ ): అనంతపురం- కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని గుమ్మలకుంట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.శనివారం ఉదయం 30 మంది ప్రయాణికులతో నల్లమాడ నుండి అనంతపురం వస్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని గుమ్మలకుంట వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవరు, కండక్టర్తో పాటు ఒక మహిళా ప్రయాణికురాలు గాయపడ్డారు. వెంటనే పొలాల్లో ఉన్న రైతులు భారీగా తరలివచ్చి ప్రయాణికులను బస్సులో నుండి కిందికి దింపి వేయించారు. గాయపడ్డ వారు బత్తలపల్లి ఆర్ డి టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి.ప్రాణాపాయం తప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాద స్థలిలో ప్రయాణికుల అరుపులతో సమీప పొలంలోని రైతులు భయాందోళన చెందారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement