Thursday, April 25, 2024

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా.. ఆ జిల్లాలో అత్యధిక కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 43,494 మంది సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 478 కేసులు బయట పడ్డాయి. కోవిడ్ తో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అదే సమయంలో 574 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,62,781కి చేరగా.. ఇందులో 20,43,050 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 5,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14,333 మంది కరోనాతో మరణించారు.

జిల్లాల్లా వారీగా కేసులు వివరాలు :

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లో 119 కేసులు నమోదు కాగా. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 18, చిత్తూరు 96, గుంటూరు 60, కడప 24, కృష్ణా 39, నెల్లూరు 29, ప్రకాశం 18, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 20, విజయనగరం 5 పశ్చిమగోదావరి జిల్లాలో 35 కేసులు వెలుగు చూశాయి.

ఇది కూడా చదవండి: ‘మా’ ఎన్నికల వివాదం: ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే..

Advertisement

తాజా వార్తలు

Advertisement