Thursday, November 7, 2024

Ap:గోదావ‌రి పుష్క‌రాలు…

వంద కోట్లు నిధులు విడుద‌ల చేసిన కేంద్రం

అమ‌రావ‌తి – ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల చేసింది కేంద్ర సర్కార్‌. తూర్పుగోదావరి జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపులు జరిగాయి. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయింపు జరిగాయి.
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాజమండ్రి నగరాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement