Thursday, April 25, 2024

గ్రామాల్లో రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు కరెంట్ కోత

ఏపీలో గత కొన్నేళ్లుగా కనిపించని కోతలు ఇప్పుడు ఒక్కసారిగా మీద పడడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో గ్రిడ్‌పై భారం తగ్గించేందుకు అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు దాదాపు మూడు గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఏపీ జెన్‌కో థర్మల్, సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు దాదాపు 95 ఎంయూల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీనివల్ల లోడ్ సర్దుబాటు కోసం కోతలు విధించక తప్పడం లేదని పేర్కొన్నారు. కోతలను నివారించేందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.

ఇది కూడా చదవండి: నేతలందరూ పాదయాత్రలు బ్రహ్మాండంగా చేయాలి: కేటీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement