Saturday, January 4, 2025

AP – రేపు సాలూరులో పర్యటించనున్న పవన్ కల్యాణ్

అమరావతి ‍ ‍‍‍ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్ పర్యటించబోతున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న పవన్‌ కల్యాణ్‌.. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో సాలూరు చేరుకుంటారు.. ఉదయం 11.30 గంటలకు సాలూరు డిగ్రీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు.. సాలూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు మక్కువ మండలం బాగుజోల చేరుకుంటారు… అక్కడ‌ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత రోడ్ల నిర్మాణ పనులకు‌ శంకుస్థాపన‌ చేయనున్నారు పవన్‌ కల్యాణ్.. అనంతరం అక్కడ గిగిజనులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.. ఆ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement