Monday, November 11, 2024

AP – మరి కొద్దిసేపటి లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పల్లె పండుగ ప్రారంభం

అమరావతి – రాష్ట్రంలో ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ.4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను చేపట్టనుంది ప్రభుత్వం. 3 వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలో మీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాల వంటి పనులను కూటమి ప్రభుత్వం చేపట్టనుంది.

- Advertisement -

.కృష్ణాజిల్లా కంకిపాడు నుంచి ఈ వారోత్సవాలు ప్రారంభం అవ్వనున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ చేతుల మీదుగా పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభంకానున్నాయి. కంకిపాడులోని టీడీపీ కార్యాలయ ఆవరణలో సభ నిర్వహించనున్నారు. కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంటు రోడ్లు, రూ. 4.15 లక్షలతో రెండు గోకులాలు, పునాదిపాడులో రూ.54 లక్షలతో రెండు సిమెంటు రోడ్ల నిర్మాణానికి పవన్‌కళ్యాణ్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement