Saturday, January 4, 2025

AP – డోలీ మోతలకు ఇక‌ మ‌న్యం దూరం … రోడ్ల నిర్మాణంతో గిరిజ‌నుల‌ కొత్త ప్ర‌యాణం – ప‌వ‌న్ క‌ల్యాణ్

సాలూరు – ఆంధ్రప్రభ – ఒకటే మాట చెబుతున్నా… మేం మీ కోసమే పని చేస్తాం. మీకు మాట ఇచ్చి అయిదేళ్లు తర్వాత వచ్చి వెళ్లం . అధికారం లేనప్పడు తిరిగాం. బుగ్గలు తడమటం తెలీదు, తల నిమరటం రాదు. కన్నీళ్లు తుడిచి పారిపోను. మీకు మాట ఇచ్చాను. రెండు నెలలకు ఒక సారి మన్యంలో తిరుగుతాను. గిరిజన బిడ్డలకు, గిరిజన యువతకు, గిరిజన పెద్దలకు గిరిజన తల్లులకు చెబుతున్నా.. వళ్లు వంచి పని చేస్తాను. అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

వాతావరణం అనుకూలించక పోయినా… చిరుజల్లులు తడిపేస్తున్నా.. మన్యంలో డోలీ మోతల కాలం చెల్లాలనే లక్ష్యంతో పవన్ మన్యంలో అడుగుపెట్టారు. కొండలు, గుట్టలను లెక్క చేయలేదు. సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇకపై గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదు అనే లక్ష్యంతో 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా రూ.36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర రహదారుల నిర్మాణం పునాది వేశారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తి కాగానే , 3,782 మంది గిరిజనుల డోలీ కష్టాలు తీరుతాయి.

ఔను ఇన్ని దశాబ్దాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో, గత 3 ఏళ్లలో దాదాపు 21 డోలి మోతలు జరిగాయి. ఇక పవన్ గిరిజనలు పడే వ్యథను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన గిరిజనులతో మాట్లాడుతూ, ఏటా రూ.50కోట్ల బడ్జెట్తో మన్యంలోని రోడ్లను అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పాడేరు, రంనచోడరం. అన్ని ప్రాంతాలను అనుసంధానం చేయటానికి రూ. 350 కోట్లు తో ప్రతిపాదన తీసుకువచ్చామని వివరించారు. అన్ని పనులు చేస్తాం, మీ సహకారం కావాలి. ఈ విజయనగరం జిల్లా చూస్తుంటే, అడవుల్లో ఇంత సుందర ప్రాంతంలో పుట్టిన మీరు అదృష్టవంతులు. మిమ్మల్ని చూసి అసూయ కలిగింది. మీకు బడి కావాలి. ముందు చదువు. తరువాత భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడే గుడి. నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. వర్షంలో తడుస్తున్నారు. రోడ్డులేక బాధ పడుతున్నారు. మీరు పడిన బాధను స్వయంగా తెలుసుకున్నాను. మీకోసం పని చేసే సమూహాన్ని గెలి పించారు. ఐ లవ్ యూ టూ. మీకు చెప్పినంత ఐలవ్ యూ నా బిడ్డలుకు చెప్పలేదు, అని పవన్ కళ్యాణ్ అనగానే యువత కేరింతలు కొట్టారు. అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమ కు రుణగ్రస్తుడిని. అందుకే భగవంతుడిని ప్రార్థించాను, . దారిలో వస్తూ కష్టాలు తీర్చే శక్తి ఇవ్వండి అని సవర పూలమాంబ తల్లిని అడిగా అని పవన్ కళ్యాణ్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement