Friday, October 4, 2024

AP – రాములోరి రథం నిప్పు – వైసీపీ నాయకుడి అరెస్టు

(ఆంధ్రప్రభ స్మార్ట్, అనంతపురం ) – ఏపీలో సంచలనం సృష్టించిన రాములోరి రథానికి నిప్పుపెట్టిన దురాఘతంలో నిందితుడిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు వైసీపీ నాయకుడని పోలీసులు స్పష్టం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కణేకల్ మండలం హన కనహళ్ గ్రామంలో రాములోరి రథానికి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ ఘటనపై సాక్షాత్తు సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టినోళ్లను సహించలేదని దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ జగదీష్ బృందం 24 గంటల్లోనే రామాలయం రథానికి నిప్పు పెట్టిన నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

సోమవారం అర్ధరాత్రి సమయంలో అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాములొరి రథానికి నిప్పు పెట్టారు. మండపంలో భద్రపరిచిన ఉండగా దుండగులు ఈ పని చేశారు. తాళాలు పగులకొట్టి, మండపంలోకి ప్రవేశించి రథంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలు ఆర్పారు. అప్పటికే రథం ముందు భాగం కాలి పోయింది.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ అండ్ టీం దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో పలు కీలక అంశాలు గుర్తించారు. హనకనహళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022లో ఎర్రస్వామి రెడ్డి బ్రదర్స్‌ సొంత డబ్బులు రూ. 20 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేయించారు. ఇదే గ్రామస్తుల మధ్య విభేదాలకు కారణమైంది. ఆ విభేదాలతోనే రథానికి నిప్పు పెట్టారు.

రాయ దుర్గం సీఐ వెంకట రమణ ఎస్ఐ నాగ మధు ఆధ్వర్యంలో కేసు విచారించి వైసీపీ కార్యకర్త బొడిమల్ల ఈశ్వర రెడ్డిని అరెస్టు చేశారు. బొడిమల్ల ఈశ్వర రెడ్డిని పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement