Friday, October 4, 2024

AP – రఘురామ కేసు.. మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు ముంద‌స్తు బెయిల్ నో

అమరావతి: సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వైసిపి హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విజయ్‌పాల్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టులో వాదోప‌వాదాలు జ‌రిగాయి.. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్నఅనంత‌రం ముంద‌స్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరిస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement