Saturday, April 20, 2024

Flash: ఏపీలో EAPCET షెడ్యూల్‌ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే…

ఏపీలో EAPCET షెడ్యూల్‌ విడుదల అయింది. ఏపీ ఈఏపీ సెట్‌(EAP CET) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్‌ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 11న ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలిపారు. ఆగష్టులో EAP CET ఫలితాలు, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. గతంలో 136 సెంటర్లలో నిర్వహించామని, ఈ సారి అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement