Monday, November 11, 2024

Ap: కొత్త కొత్తగా లిక్క‌ర్ షాపులు..

ఏపీలో స‌ర్కారు మ‌ద్యం నేటితో బంద్‌
రేపు ఉదయం 10 గంటలకు తెరుచుకోనున్న కొత్త వైన్ షాపులు
లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించిన ప్రభుత్వం
క‌ర్నాట‌క‌, తెలంగాణ‌, ఢిల్లీ, ఇత‌ర దేశాల నుంచి ద‌ర‌ఖాస్తులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌:

ఏపీలో అయిదేండ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు మంగ‌ళ‌వారంతో మూతపడనున్నాయి. రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా… మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. లాటరీ పద్ధతి ద్వారా సోమ‌వారం మద్యం దుకాణాలను కేటాయించారు. మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నవారు రేపటి నుంచి షాపులను తెరుచుకోవచ్చు. రేపు ఉదయం 10 గంటలకు కొత్త వైన్స్ తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ తెరిచి ఉంటాయి. మద్యం షాపుల కోసం ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఆన్‌లైన్లో దరఖాస్తులు వచ్చాయి. అమెరికాతో పాటు మరి కొన్ని దేశాల నుంచి కూడా అప్లికేషన్లను వేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement