Wednesday, September 18, 2024

AP – చింత‌ప‌ల్లి ఏజెన్సీలో విరిగిప‌డ్డ కొండ చ‌రియ‌లు… ఒక‌రి మృతి..

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో . అర్ధరాత్రి ప్రాంతంలో గిరిజనుల ఇళ్లపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు ఇళ్లమీద పడ్డాయి. దీంతో కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా పలువురు గల్లంతయ్యారు. జీకే వీధి మండలం చట్రాపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులను గ్రామానికి పంపించామని ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, సీలేరు ఘాట్ రోడ్ లోనూ కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.

కాగా ,ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికు ఒక‌రు మ‌ర‌ణించిన‌ట్లు, న‌లుగురు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement