Saturday, November 9, 2024

AP | కిడ్నాప్ కాలేదు.. ఫోన్ స్విచ్ఛాఫ్​ అయ్యిందంతే !

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో మద్యం షాపు యజమాని కిడ్నాప్‌పై జరుగుతున్న ప్రచారంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. యాగ్నిశెట్టిపల్లికి చెందిన రంగనాథ్‌కు లాటరీతో మద్యం షాపు వచ్చింది. అయితే, అందుకోసం అతడిని ఎవరో కిడ్నాప్ చేశారనే ప్రచారం సాగింది.

అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. అది అవాస్తవమని రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐని కలిసి పరిస్థితిని వివరించారు. తన ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో… తనని ఎవరో కిడ్నాప్ చేశాడని పొరబడి.. భార్యకు ఫోన్ చేసి నీ భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పినట్టు తెలిపాడు. దీంతో అతని భార్య ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement