Friday, April 26, 2024

సమాచారం లేకుండా పిల్ ఎలా వేస్తారు?

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు వారానికి వాయిదా వేసింది. సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ నియామక జాబితాలో ప్రభుత్వం పంపిన 3 పేర్లు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆరోపించారు. మరిన్ని అదనపు వివరాలు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, ఈ దశలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం లేకుండా పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా, నిన్న ఎస్ఈసీ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement