Wednesday, April 24, 2024

డిప్యూటీ సీఎం పుష్పవాణికి హైకోర్టు నోటీసులు!

ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పుష్పవాణీకి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే పదవికి పుష్పశ్రీవాణి అనర్హురాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పుష్పవాణీ ఎస్టీ కాదంటూ రిటైడ్ టీచర్ కె.మణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది బి.శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి పుష్పశ్రీవాణి గెలిచారు. అయితే, పుష్పవాణీ అసలు ఎస్టీ కాదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.

తహశీల్దార్ ఇచ్చిన కులధ్రువీకరణపత్రం చెల్లదని, ఆర్డీవో, ఆపై స్థాయి అధికారి అధికారులు ఇచ్చిన కులధ్రువీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటవుతుందని వాదనలు వినిపించారు. ప్రతివాదులుగా ఉన్న సీఎస్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి, కేంద్ర ఈసీ సెక్రటరీ జనరల్ కు, పగో కలెక్టర్, బుట్టాయిగూడెం ఎమ్మార్వోకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వారం రోజుల పాటు ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement