Thursday, March 28, 2024

జీవోలు ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?

ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. సాఫీగా జరిగే ప్రక్రియను ఎందుకు తొలగించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నూతన విధానాన్ని ఎందుకు ప్రవేశ పెట్టాల్సి వచ్చిందని అడిగింది. కాన్ఫిడెన్షియల్ పేరిట ఉన్న జీవోలను ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించింది. సంతకం లేని జీవోలను హైకోర్టు, సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో ఆన్‌లైన్‌లో జీవోలను పెట్టటం నిలిపి వేశారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 27కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. అసలేం జరిగింది?

Advertisement

తాజా వార్తలు

Advertisement