Thursday, October 3, 2024

AP క‌ర్నూలులో హైకోర్టు బెంచ్.. అమ‌రావ‌తిలో అంత‌ర్జాతీయ ‘లా’ క‌ళాశాల‌..

అమరావతి: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన న్యాయశాఖపై సమీక్ష నిర్వహించారు. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపనున్నట్లు స్పష్టం చేశారు. మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్టు ద్వారా 100 ఎకరాల్లో న్యాయకళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్‌ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

ఇమామ్ ల‌కు గౌర‌వ వేత‌నం పెంపు

అంతకుముందు మైనారిటీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ పథకాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు. కడప హజ్‌ హౌస్‌, గుంటూరు క్రిస్టియన్‌భవన్‌ను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నూర్‌ బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మైనార్టీలకు లబ్ధి జరిగేలా వక్ఫ్‌ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement