Wednesday, April 24, 2024

బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు?

ఏపీలో బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌పై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కొరత, అత్యధిక ధరలకు అమ్మకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్ పై ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేంద్రం సరిపడా ఇంజక్షన్లు సరఫరా చేయటం లేదని తెలిపింది. 1,400 మంది పేషేంట్స్‌కు 13 వేల ఇంజక్షన్లు మాత్రమే ఇచ్చారని ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో రోగికి రోజుకి 3 ఇంజక్షన్ల చొప్పున 15 రోజులు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ ఫంగస్ రోగుల కోసం 50 వేల ఇంజక్షన్లు అవసరం ఉందని వెల్లడించింది. ప్రైవేట్ ఫార్మా కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోలుకి సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ‘ఏపీ అవసరాలకు సరిపడా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు? కేంద్రం మధ్యాహ్నంలోగా సమాధానం చెప్పాలి’ అని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement