Monday, October 7, 2024

AP – తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ భ‌ద్ర‌త‌..

తిరుమలలో ఈనెల 4 నుంచి 12వ తేదీవరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. తిరుమ‌ల‌లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

అందుబాటులో 2 వేలకు పైగా సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు..

ప్రయాణిలకు భద్రత ప్రథమ ప్రాధాన్యం కింద తీసుకుని ఆర్టీసీలో ప్రయాణం భద్రత ఉంటుందని అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న‌ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.. తిరుమ‌ల‌కు స‌మీప ప్రాంతాల నుంచి అదనపు బస్సులను నడుపుతున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement