Wednesday, November 6, 2024

AP – అనంతపురంలో భారీ వర్షం – వరద గుప్పిట్లో జనం

అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ దెబ్బకు అనంతపురం నగరం సమీపంలోని ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాత్రి పూట భారీ వర్షాలు కురవడంతో గాఢనిద్రలో ఉన్న ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రజలు వారి ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు.

అనంతపురం నగరం సమీపంలోని పండమేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అనంతపురంలో ఒక్కసారిగా భారీ వర్షాలు పడటంతో ఆ పరిసర ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. అనంతపురం కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

- Advertisement -

ఇదే సమయంలో అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలం లోని ముక్తాపురం చెరువు నీరు పారడంతో ఆ వర్షపు నీరు బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై చేరుకుంది. వర్షం నీరు, చెరువు నుంచి ప్రవహించిన నీరు జాతీయ రహదారిపై చేరుకోవడంతో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో వాహన సంచారం అస్తవ్యస్తం అయ్యింది. కొన్ని గంటలపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

సమాచారం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది ఆ వర్షం నీరును తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. భారీ వర్షం రావడంతో పాటు చెరువులోని నీరు జాతీయ రహదారి మీదకు రావడంతో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో సంచరిస్తున్న వాహన చోదకులు అనేక ఇబ్బందులకు గురైనారు. వాహనాలలో నుంచి బయటకు వెళ్ళలేక, ఆ వాహనాలు ముందుకు కదలలేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని గంటల తర్వాత ఆ వర్షం నీరును తొలగించారు.

*భారీ వర్షాలపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన**

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న పరిటాల సునీత

గత రాత్రి నుంచి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో భారీ వర్షం

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు

కనగానపల్లి చెరువుకు గండి.. పంటలకు భారీ నష్టం

అధికారులతో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న ఎమ్మెల్యే సునీత

రామగిరి – N S గేట్, ముత్తవకుంట్ల-కనగానపల్లి, తగరకుంట-కనగానపల్లి రహదారులన్నీ బ్లాక్

*వర్షపు నీటిని దాటుకొని బాధిత ప్రాంతాల్లోకి వచ్చేందుకు ఎమ్మెల్యే సునీత ప్రయత్నం

*పంట నష్టం, పశు నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు సూచన

ప్రసన్నయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు పరివాహక ప్రాంతాలు కాలనీలు జలమయం

ఉప్పరపల్లి సమీపంలో వరదలో మునిగిన ప్రాంతాలను అధికారులతో కలసి పరిశీలిస్తున్న పరిటాల శ్రీరామ్

ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. వెంటనే సమాచారం అందించాలన్న సునీత

.

Advertisement

తాజా వార్తలు

Advertisement