Saturday, October 5, 2024

AP – వంగవీటి రాధాకు గుండెపోటు

( ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో) – టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున వంగవీటి రాధాకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.

48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. వంగవీటి రాదాను పరీక్షించిన డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. వంగవీటి రాధా గుండెపోటు సమాచారంతో అభిమానులు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పలువురు ఆయన ఇంటికి వెళ్లి మరీ వివరాలు కనుక్కున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement