Friday, March 29, 2024

Breaking: మండలి రద్దుపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును రద్దు చేసిన జగన్ సర్కార్.. తాజాగా శాసన మండలి రద్దు చేయాలన్న గత తీర్మానాన్ని వెనక్కి తీసుకోనుంది. నేడు దీనిపై తీర్మానం చేసే అవకాశం ఉంది. ఉపసంహరణ తీర్మానం కాపీని ప్రభుత్వం.. కేంద్రానికి పంపనుంది.

గతేడాది నుంచి శానసమండలి రద్దు వ్యవహారం పెండింగ్‌లో ఉంది. గతేడాది జనవరిలో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, మూడు రాజధానుల బిల్లులను శాసనమండలి వ్యతిరేకించింది. బిల్లులు ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకుంది. నాడు మండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ బిల్లులకు ఆమోదం పొందలేదు. అయితే 151 స్థానాలున్న అసెంబ్లీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని, ప్రజాబలంతో గెలిచిన శాసనసభ నిర్ణయాన్ని టీడీపీ బలం ఎక్కువగా ఉన్న మండలి వ్యతిరేకించిందని సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి నిర్వహణకు రోజూ రూ.లక్షల్లో భారం మోయాల్సి వస్తోందని.. ఈ వ్యవస్థే వద్దని.. రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జనవరి 27న శాసనసభలో తీర్మానం పెట్టారు. దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు.

ప్రస్తుతం శాసనమండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఆధిక్యం వచ్చింది. అందుకే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందనే చర్చ జరుగుతోంది. అయితే మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్న ప్రభుత్వం మళ్లీ శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement