Thursday, March 28, 2024

వైద్య సిబ్బందికి కరోనా… ఖర్చులు భరించనున్న ఏపీ ప్రభుత్వం!

వైద్య సిబ్బంది కరోనా చికిత్సకయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. కరోనాతో కారంచేడు పీహెచ్సీ వైద్యులు డాక్డర్ ఎన్ భాస్కరరరావు తీవ్ర అస్వస్థతకు గురై, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారన్నారు. డాక్టర్ భాస్కరరావుకు మెరుగైన వైద్యమందించడానికి రూ.1.50 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సాయమందించారన్నారు. ఇటువంటి కేసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు రూ.45 వేల నుంచి 70 వేల వరకూ పెంచిన స్టయిఫండ్ ను గతేడాది సెప్టెంబర్ నుంచి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జనవరి నుంచి అమలు చేయాలని తొలుత భావించామని, సెప్టెంబర్ 2020 నుంచి పెంచిన స్టయిఫండ్ అందజేయాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు.

కొవిడ్ విధుల్లో పాల్గొంటున్న మూడో సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థులకు కూడా పెరిగిన స్టయిఫండ్ ను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. పీజీ విద్యార్థులు ఏప్రిల్ 30 తరవాత విధుల్లోకి చేరారని, ఆనాటి నుంచి పెంచిన స్టయిఫండ్ అందిస్తామని తెలిపారు. వారి వార్షిక పరీక్షలను జులై లో నిర్వహించడానికి హెల్త్ యూనివర్శిటీ నిర్వహించనునందన్నారు. పరీక్షల్లో పాల్గొన్నా జులై 31 వరకూ పెంచిన స్టయిఫండ్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారన్నారు. రాష్ట్ర్ర స్థాయి కొవిడ్ కమాండ్ కంట్రోల్ కమిటీ సమావేశం శనివారం జరిగిందన్నారు. ఈ సమావేశంలో థర్డ్ వేవ్ వస్తుందన్న సూచనల మేరకు, ఎంతమంది కరోనా బారిన పడతారో అంచనా వేసి వైద్య పరికరాలు, మందులు కొనుగోలుపైనా, ఐసీయూ బెడ్లు ఏర్పాటుపైనా చర్చించామన్నారు. జిల్లాల వారీగా డేటా సేకరించిన తరవాత ఆ కమిటీ ఇచ్చే రిపోర్టును సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్ కి ఫేస్‌బుక్‌ షాక్.. ఖాతాపై రెండేళ్ల నిషేధం

Advertisement

తాజా వార్తలు

Advertisement