Thursday, April 25, 2024

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పిలుస్తోంది…..

అమరావతి, ఆంధ్రప్రభ: దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోంది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు విజయవంతం అయిన నేపథ్యం ఒకవైపు, దిగ్గజ పారిశ్రామికవేత్తలం దరూ తమతమ పెట్టుబడులను ఏపీలో పెట్టబోతున్నామంటూ సభా వేదిక నుండే ప్రకటించడం ఇంకోవైపు వెరసి ఇప్పుడు అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. గ్లోబల్‌ సమ్మిట్‌కు తాము రాలేకపోయినందుకు ఇప్పుడు ఆయా కంపెనీలు పునరాలోచనలు పడుతున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంతో తాము పెట్టుబడులు పెట్టేందుకు ఆస్తిగా ఉన్నామని, తమకు అవసరమైన ఏర్పాట్లు చేయగలిగితే తమ కంపెనీలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయని తెలుస్తోం ది. వచ్చే మూడు మాసాల వ్యవధిలో ఏపీలో పెట్టుబడులు పెట్టడంతోపాటు వాటిని నిజ రూపంలోకి తీసుకురావడానికి తామంతా సిద్ధంగా ఉన్నామంటూ చెబుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడిది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖ వేదికగా రెండు రోజుల పాటు విజయ వంతంగా నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచింది. ఇదే తరహాలో పంజాబ్‌లో వచ్చే రెండు మాసాల్లో ్ట 2| ఓ్లబ…(మొదటి పేజీ తరువాయి)
పెట్టుబడుల సదస్సు నిర్వహించేందు చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆరాష్ట్రం తరహాలోనే మరో నాలుగైదు రాష్ట్రాలు ఈతరహా పెట్టుబడుల సదస్సు నిర్వహణకు సిద్దమౌతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగాచూస్తే దేశవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీవైపు ఆసక్తిగా చూస్తున్నట్లు మాత్రం ప్రస్ఫుటంగా అర్ధమౌతోంది.


దేశం దృష్టిని ఆకర్షించిన ఏపీ :
దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంతా ఒకే వేదికపైకి వచ్చిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. అంతకుమించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దార్శినికత, కార్యదక్షతకు నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానాలు, సరళతర వాణిజ్య విధానాలు ఎంతటి సత్ఫలితాలనిస్తున్నాయో ప్రంపచానికి చాటిచెప్పింది. సీఎం జగన్‌ ఏపీలో సృష్టించిన పారిశ్రామిక అనుకూల వాతావరణం గురించి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రముఖంగా ప్రస్తావించడంతో ఏపీలో వనరులపై పెట్టుబడిదారులందరికీ ఒక అవగాహన ఏర్పడింది. సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం కూడా ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు అడ్వాంటేజ్‌గా మారింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ స్వయంగా ఈ సదస్సుకు హాజరవడం, ఏపీలో వనరులను ప్రత్యేకించి ప్రస్తావించడం, సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహాలను ఆయనే స్వయంగా కొనియాడటం ఒక హైలైట్‌గా నిలిచింది.

రెండు రోజుల సదస్సులో రూ. 13 లక్షల కోట్లు :
రెండు రోజుల సదస్సుల్లో మొత్తం 5 శాఖల పరిధిలో రూ. 13,41,734 విలువైన 378 ఎంఓయూలు జరగ్గా వీటిద్వారా 6,09,868 మందికి ఉపాధి లభించనుంది. తొలి రోజు 11.85 లక్షల కోట్ల విలువైన 92 ఎంవోయూలు కుదుర్చుకోగా 4 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇక రెండో రోజు రూ. 1.56 లక్షల కోట్ల విలువైన 286 ఒప్పందాలు కుదుర్చుకోగా 2.10 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎన్టీపీసీ రూ. 2..35లక్షల కోట్ల ఎంవోయూతో అగ్రగామిగా నిలిచింది. ఏబీసీ లిమి-టె-ట్‌ (రూ. 1.20 లక్షల కోట్లు-), రెన్యూ పవర్‌ (రూ. 97,550 కోట్లు-), ఇండోసాల్‌ (రూ.76,033 కోట్లు-), ఏసీఎమ్‌ స్‌ఈ (రూ.68,976 కోట్లు-), టీ-ఈపీఎసీఎల్‌ (రూ. 65, 000 కోట్లు-), జేఎస్‌ డబ్ల్యూ గ్రూప్‌ (రూ. 50, 632 కోట్లు-), హంచ్‌ వెంచర్స్‌ (రూ. 50 వేల కోట్లు-), అవాదా గ్రూప్‌ (రూ 50 వేల కోట్లు-) జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. ఇక రెండు రోజుల ఈ అవగాహన ఒప్పందాల ద్వారా ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టు-బడులు వస్తున్నాయని సీఎం జగన్‌ చేసిన ప్రకటన.. కార్యరూపం దాల్చినట్లయ్యింది. మొత్తంగా 340 పెట్టు-బడుల ప్రతిపాదనలు, 20 రంగాల్లో పెట్టు-బడులకు ముందుకు వచ్చాయి. ఈ ఎంవోయూల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement