Thursday, April 25, 2024

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రెండవ రోజు షెడ్యూల్

విశాఖపట్నం: ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రెండవ రోజు శనివారం ఉదయం 9 గంటలకు ఎంవోయూలపై సంతకాలతో ప్రారంభ మైంది.. 10.30 గంటలకు ప్రముఖ ఇండో అమెరికన్‌ మ్యుజీషియన్‌ కర్ష్‌ కాలే బ్యాండ్‌ ప్రదర్శన ఉంటుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ప్రారంభ ఉపన్యాసం, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రసంగం ఉంటుంది.

ఆ తర్వాత నోవా ఎయిర్‌ సీఈఓ అండ్‌ ఎండీ గజానన్‌ నాబర్, అవాడ గ్రూప్‌ చైర్మన్‌ వినీత్‌ మిట్టల్, లారస్‌ ల్యాబ్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సత్యనారాయణ చావ, హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ డాక్టర్‌ వంశీ కృష్ణ బండి, గ్రీన్‌కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనీల్‌కుమార్‌ చలమశెట్టి, సెయింట్‌ గోబిన్‌ ఆసియా-పసిఫిక్‌ అండ్‌ ఇండియా సీఈఓ సంతానం.బి ప్రసంగాలు ఉంటాయి..

అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, అపాచీ అండ్‌ హిల్‌టాప్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అండ్‌ గ్రూప్‌ హెడ్‌ ఇండియా ఆపరేషన్స్‌ సర్జియో లీ, బ్లెండ్‌ హబ్‌ ఫౌండర్‌ హెన్‌రిక్‌ స్టామ్‌ క్రిస్టెన్‌సన్, వెల్‌స్పన్‌ గ్రూప్‌ ఎండీ రాజేష్‌ మండవేవాలా, వెల్‌స్పన్‌ గ్రూప్‌ ఎండీ సతీష్‌రెడ్డి, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఐఐ సదరన్‌ రీజియన్‌ చైర్‌పర్సన్‌ సుచిత్ర కె.ఎల్లా ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ కీలక ఉపన్యాసం ఉంటుంది. అనంతరం సమ్మిట్‌ వేదికపై నుంచి కొత్త పరిశ్రమ యూనిట్ల ప్రారంభోత్సవం, సీఎం వైఎస్‌ జగన్‌ ముగింపు ఉపన్యాసం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement