Wednesday, November 27, 2024

AP – గ్యాస్ లోడు లారీ బోల్తా..

వేంపల్లి (ఆంధ్రప్రభ) పులివెందుల నియోజకవర్గం వేంపల్లి సమీపంలోని ఎస్ఎన్ఆర్ కళ్యాణమండపం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తున్న హెచ్ పీ గ్యాస్ సిలిండర్ లారీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రజలు అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ లారీ బోల్తా పడినప్పటికీ డ్రైవర్ కు చిన్నపాటి గాయాలు అయ్యాయి.గ్యాస్ లీక్ అయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదేమో అని సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలు అంటున్నారు. ఏది ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చుట్టుపక్కల ఉన్న స్థానికుల సమాచారంతో ఘటనా స్థలం వద్దకు పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు . ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement