Friday, December 6, 2024

APలో విషాదం .. వాగులో మునిగి నలుగురు మృతి

రంప‌చోడ‌వ‌రం – ఇసుక కోసం వాగులోకి దిగి నలుగురు యువకులు మరణించిన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో చోటుచేసుకుంది. జిల్లాలోని అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఈ విషాద ఘటన జరిగింది. వాగులో నుంచి ఇసుక తీస్తుండగా ఒక్కసారిగా లోతులోకి వెళ్లి ఊబిలో కూరుకుపోయాడు భూషణం. దీంతో అత‌డిని అతడిని కాపాడేందుకు వెళ్లిన బాబు, గొంతయ్య, శ్రీను కూడా వాగులో మునిగి మరణించారు.

మృతుల్లో తండ్రి కొడుకులు కూడా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే వీరంతా ఏలేరుకు చెందినవారుగా గుర్తించారు పోలీసులు. అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు పంపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని..

Advertisement

తాజా వార్తలు

Advertisement