Monday, December 2, 2024

AP – విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో విద్యుత్ షాక్‌తో నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు..

నేటి ఉదయం జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

స్థానికంగా పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా ఘటన చోటు చేసుకుంది.ప్లెక్సీ కట్టే సమయంలో ప్రక్కనే ఉన్న కరెంటు తీగలు తగిలి షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement